వారందరి చేతుల్లోకి 4.34 లక్షల ట్యాబ్ లు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చేతుల్లోకి ట్యాబ్ లు వచ్చేసాయి
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చేతుల్లోకి ట్యాబ్ లు వచ్చేసాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను ఇస్తోంది. ఈ ఏడాది రూ.620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్ లను అందించింది ప్రభుత్వం. ఈ ట్యాబ్ లలో రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ను ప్రిలోడెడ్ గా ఉంది. ట్యాబ్ ధర రూ.17,500 తో కలిపి ప్రతీ విద్యార్థికి రూ.33 వేల మేర లబ్ది కలుగుతుందని చెప్పారు. రెండేళ్లలో 9,52,925 ట్యాబ్ లు (విద్యార్థులు, టీచర్లకు కలిపి) పంపిణీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. వీటి విలువ రూ.1,305.74 కోట్లు అని అధికారులు చెప్పారు.