Mon Apr 14 2025 10:15:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇకపై సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇకపై సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటు లోకి వచ్చింది. ఇకపై సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కువ మంది పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ కొంత వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. సెలవు రోజుల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు అయితే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
Next Story