Mon Dec 23 2024 16:52:47 GMT+0000 (Coordinated Universal Time)
Diwali Good News : దీపావళికి గుడ్ న్యూస్.. ఏడాదికి మూడు వేలు ఖర్చయినా?
ఏపీ ప్రభుత్వం దీపావళికి గుడ్ న్యూస్ ను ప్రకటించింది. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం ప్రారంభించనుంది
ఏపీ ప్రభుత్వం దీపావళికి గుడ్ న్యూస్ ను ప్రకటించింది. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచే పంపిణీ చేయడం ప్రారంభించనుంది. అంటే ఈ నెల 31వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పారు.
వచ్చే కేబినెట్ లో...
మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మాట్లాడుతూ ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై రానున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభిస్తుందన్న ఆయన ఖాజానాలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
Next Story