Wed Oct 30 2024 15:21:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ కు ఏడు వేల కోట్ల అప్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడు వేల కోట్ల రూపాయల రుణానికి ఆమోదం పొందింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడు వేల కోట్ల రూపాయల రుణానికి ఆమోదం పొందింది. ఇప్పటి వరకూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో 47 వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్న ఏపీ సర్కార్ మరో ఏడు వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచ అనుమతిని పొందింది. దీంతో ఐదు నెలల కాలంలోనే యాభై నాలుగు వేల రూపాయల కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నట్లయింది.
కేంద్రం ఆమోదం...
ఈ మేరకు మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000 కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్లో ముగిసిపోయింది. దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే చెప్పింది. ఇది అడ్వాన్స్ మాత్రమేనని, మిగిలింది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. కాగా ఈ ఆర్ధిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయల వరకూ అప్పు చేసింది.
Next Story