Mon Dec 23 2024 02:38:28 GMT+0000 (Coordinated Universal Time)
పింఛను పంపిణీపై మార్గదర్శకాలు రెడీ?
ఆరో తేదీ లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఆరో తేదీ లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోగులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి పింఛను మొత్తం అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగిలిన వారికి వార్డు, గ్రామ సచివాలయాలకు పింఛనును అందచేయాలని తెలిపింది. ఈ నెల 6వ తేదీలోపు పింఛన్లన్నీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వలు జారీ అయ్యాయి. సిబ్బంది కొరతతో రెండు రకాలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించిది.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో...
ప్రతి నెల ఒకటోతేదీన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛను మొత్తాన్ని అందచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను వినియోగించవద్దని తెలిపింది. దీంతో ఈ నెల పింఛను ఇప్పటి వరకూ అందకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ సచివాలయాలు పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story