Mon Dec 16 2024 15:44:28 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పుస్తకాల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పుస్తకాల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పుస్తకాలను సిద్ధం చేసింది. జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి ఇంటర్ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1,08,619 మంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
ప్రభుత్వ కళాశాలలో...
92,134 మంది ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలతోపాటు సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు పుస్తాకాలు చేరాయి.
Next Story