Sun Jan 05 2025 07:23:47 GMT+0000 (Coordinated Universal Time)
Free Gas Cylinders in Andhra Pradesh: వీరికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందే అవకాశం లేదట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని కసరత్తులు ప్రారంభించింది. అధికారులు ఇప్పటికే దీనిపై కసరత్తులు పూర్తి చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తుంది. అంటే ఇక ఏడాది మొత్తం గ్యాస్ కొనుగోలు చేసే వీలుండదు. పేద తరగతి ప్రజలకు ఇది వరం లాంటిది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దీపావళికి ఈ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలతో అధికారులు చర్చలు జరిపారు. వారికి నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
వీరికి మాత్రమే..
అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని అర్హతలు నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత ఖచ్చితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. గ్యాస్ సిలిండర్ పొందాలంటే వారు ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసం ఏర్పరచుకుని ఉండాలి. ఇక్కడ ఇల్లు ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. దీంతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు తప్పని సరిగా ఉండాలని నిబంధన విధించింది. దీంతో పాటు ఆ ఇంట్లో ఒకే ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. దీంతో పాటు కేవలం డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఈ పథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్ లో దరఖాస్తు...
అయితే ఈ పథకం కోసం దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే వీలును ఏపీ ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వనిస్తుందని అధికారులు చెబుతున్నారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న 1.30 తెలుపు రంగు రేషన్ కార్డులలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు. లబ్దిదారులు ఖచ్చితంగా తమ మొబైల్ నెంబరు, విద్యుత్తు బిల్లు, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లు కూడా దరఖాస్తులో పొందపర్చాలి. త్వరలోనే ఈ దరఖాస్తు ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్ లో పెట్టనుందని అధికారులు తెలిపారు. దీపావళి రోజు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అందాలంటే ఈ పనిచేయాల్సిందే.
Next Story