Mon Dec 23 2024 09:54:49 GMT+0000 (Coordinated Universal Time)
వరద బాధితులకు గుడ్ న్యూస్.. వారి బ్యాంక్ అకౌంట్లలో పరిహారం జమ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాల అకౌంట్లలో ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని జమ చేసింది
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాల అకౌంట్లలో ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని జమ చేసింది. ఇప్పటి వకూ 509 కోట్ల రూపాయల వరకూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పెద్దయెత్తున పంటలకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని నేడు వారి అకౌంట్లలో వేసింది. అన్ని రకాల నష్టపోయిన నాలుగు లక్షల మంది బాధితులకు 602 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మిగిలిన వారికి...
అందులో కొందరికి బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్ గా లేకపోవడంతో నిధులు జమ చేయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. మిగిలన వారికి పరిహారం రేపు విజయవాడ కలెక్టర్ కార్యాలంలో భేటీ కానున్నారు. రేపు మిగిలిన వారికి పరిహారం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు వరదల సమయంలో కష్టపడిన అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వారికి ధన్యవాదాలు తెలపనున్నారు.
Next Story