Mon Apr 14 2025 04:07:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యబీమా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లోనూ ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతించింది. ఈ మేరకు తెలంగాణలో రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలో వైద్యం చేయించుకున్న...
తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు, పింఛనర్లు..బిల్లులు రీయింబర్స్ కాక ఇప్పటి వరకూ నష్టపోయారు. ఉద్యోగ వర్గాల డిమాండ్ తో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించడంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story