Thu Dec 12 2024 09:42:17 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మందుబాబులకు గుడ్ న్యూస్.. నిఖార్సయిన బ్రాండ్లు అందుబాటులో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రీమియం మద్యం కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా లిక్కర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఈ ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి పన్నెండు స్టోర్లకు అనుమతి ఇవ్వనున్నారు. రానున్న కాలంలో వీటి సంఖ్య పెరిగే అవకాశాలు కొట్టిపారేయలేం.
నాణ్యత కలిగిన బ్రాండ్లను...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత కలిగిన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లను అందిస్తుండటంతో మందు బాబులు ఖుషీ అవుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త పాలసీ ప్రకారం రాష్ట్రంలో 3,396 మద్యందుకాణాలను ప్రయివేటు వ్యక్తులకు వేలం ద్వారా అప్పగించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మద్యం బ్రాండ్లు ఇప్పుడు ఏపీలో లభ్యమవుతున్నాయి. మద్యం దుకాణాలను ప్రారంభించిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చేస్తున్న హెచ్చరికలతో కొంత ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రముఖ బ్రాండ్ల తయారీసంస్థలు కూడా ధరలు తగ్గించాయి. కానీ అదే సమయంలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ కు చెందిన అధికారులు చెబుతున్నారు.
ఏడాదికి కోటి ఫీజు...
ప్రీమియం బ్రాండ్ల కోసం కొత్తగా ప్రీమియం స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. వీటికి దరఖాస్తు రుసుము పదిహేను లక్షల రూపాయలుగా నిర్ణయించారు. దరఖాస్తులు ఆన్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ ప్రీమియం స్టోర్లను నిర్వహించాలంటే ఏడాదికి కోటి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు కూడా ఏటా పది శాతం పెరుగుతుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకేసారిఐదేళ్ల కాలానికి సంబంధించి ఈ ప్రీమియం స్టోర్ల లైసెన్సులను మంజూరు చేస్తారు. ఈ స్టోర్లు ఏర్పాటు చేయాలంటే కనీసం నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం ఉండాలని, వారికే లైసెన్సులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ దరఖాస్తులను పరిశీలించడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ స్టోర్లలో లిక్కర్ తో పాటు సిగార్స్, చాక్లెట్లు, సిగిరెట్ల విక్రయానికి కూడా అనుమతులు ఇవ్వనున్నారు.
Next Story