Fri Dec 20 2024 16:55:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆర్టీసీ ద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో గ్రాట్యుటీ చెల్లించేందుకు సిద్ధమయింది
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో గ్రాట్యుటీ చెల్లించేందుకు సిద్ధమయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది తమకు శుభవార్త అని వారు చెబుతున్నారు.
గ్రాట్యుటీ చెల్లించేందుకు...
ఏపీ ఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వినతి మేరకు గ్రాట్యుటీపై 16 లక్షల రూపాయల సీలింగ్ ను కూడా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తక్కువ మొత్తం పొందిన రిటైర్డ్ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. బకాయిల కోసం వారు వెంటనే సంబంధిత డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆర్థిక శాఖ నిర్ణయంపై ఆర్టీసీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story