Mon Dec 16 2024 23:41:15 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతులకు గుడ్ న్యూస్
రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న కౌలు మొత్తాన్ని విడుదల చేయడానికి సిద్ధమయింది
రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న కౌలు మొత్తాన్ని విడుదల చేయడానికి సిద్ధమయింది. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కౌలు బకాయీలను చెల్లించలేదు. కొన్ని నెలల నుంచి పెండింగ్ లో పెట్టారు. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
పెండింగ్ కౌలు మొత్తాన్ని...
అందులో భాగంగా రాజధాని రైతులకు పెండింగ్లో ఉన్న కౌలు నిధులను చెల్లించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సెప్టంబరు 15వ తేదీలోగా కౌలు రైతులకు పెండింగ్ లో ఉన్న బకాయీలను చెల్లిస్తామని ఆయన తెలిపారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ తెలిపారు.
Next Story