Thu Apr 10 2025 16:36:33 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : తమ్ముళ్లకు గుడ్ న్యూస్... నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేింది. ఇందులో 31 తెలుగుదేంపార్టీకి, ఆరు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించింది.
మిగిలిన వాటికి...
మిగిలిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని టీడీపీ నాయకత్వం తెలిపింది. మూడో విడతగా నామినేటెడ్ పదవులను ఉగాదికి భర్తీచేయాలనుకున్నా దాదాపు అరవై వేల దరఖాస్తులు రావడం, ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు రావడం ఆలస్యం కావడంతో చంద్రబాబు నాయుడు ఈ పోస్టుల నియామకంపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందంటున్నారు.
Next Story