Sun Dec 01 2024 11:02:01 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కొత్తగా పింఛను కావాలా? అయితే ఇలా చేయండి.. వెంటనే మీ అకౌంట్ లోకి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పింఛను కావాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల తొలి వారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పింఛను కావాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల తొలి వారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 65 లక్షల మంది వరకూ పింఛనుదారులున్నారు. వారిలో వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు, వితంతువులకు నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు. ఇది చిన్న మొత్తం కాదు. ఒక వ్యక్తికి నెలలో నాలుగు వేల రూపాయలంటే చాలా వరకూ ఖర్చులు మిగిలినట్లే. కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలకు పింఛను మొత్తం అందిస్తుండటంతో వృద్ధులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడా లేని విధంగా...
ప్రతి నెల ఒకటో తేదీన జీతాల తరహాలో ఇంటికి వచ్చి మరీ పింఛను చెల్లిస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఈ స్థాయిలో పింఛను మరే రాష్ట్రంలో ఇవ్వడం లేదు. పొరుగున ఉన్న తెలంగాణలోనూ నెలకు 2,116 మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం నాలుగు వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇంత పెద్దమొత్తాన్ని పొందేందుకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘకాలంగా పింఛను కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వారి ఆశలు ఫలించలేదు. కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి సిద్ధమయింది.
జనవరి నెలలోనే...
జనవరి నెలలో కొత్త పింఛను దారులకు పెన్షన్ అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ నెల మొదటి వారం నుంచి దరఖాస్తులను సచివాలయాలలో స్వీకరించనున్నారు. వృద్ధాప్య పెన్షన్, వితంతువు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, వికలాంగుల పెన్షన్, డప్పు కళాకారుల పెన్షన్, చర్మ కళాకారుల పెన్షన్, కల్లు గీత కార్మికుల పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోదలచుకున్న వారు ఈ క్రింది డాకుమెంట్స్ ను సిద్దంగా ఉంచుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా పింఛనుకు అర్హులా? కాదా? అన్నది నిర్ణయించి ఈ నెలాఖరులోగా ఒక జాబితాను ఏపీ ప్రభుత్వంవిడుదల చేసే అవకాశముంది. వారికి జనవరి నెల నుంచి పింఛను అందనుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే...
1.ఆధార్ కార్డు జిరాక్స్
2.ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ జిరాక్స్
3.కులధ్రువీకరణ పత్రం జిరాక్స్
4.ఆదాయ ధ్రువీకరణ పత్రం జిరాక్స్
5.బియ్యం కార్డు జిరాక్స్
6. గడిచిన 6 నెలల కరెంటు బిల్లు జిరాక్స్,
Next Story