Wed Nov 27 2024 10:32:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పింఛనుదారులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకే నగదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబరు నెల పింఛనును ఈ నెల 30వ తేదీన చెల్లించాలని నిర్ణయించింది. డిసెంబరు 1వ తేదీన ఆదివారం కావడంతో నవంబరు 30వ తేదీన ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 30వ తేదీన పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆదివారం కావడంతో...
డిసెంబరు 1న ఆదివారం కావడంతో నవంబరు 30న శనివారం రోజున పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీఅయ్యాయి. ఆరోజు పింఛను పొందని వారికి డిసెంబరు రెండో తేదీన చెల్లించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. లేదంటే వచ్చే నెల పొందని వాళ్లు ఒకేసారి జనవరిలో మొత్తం రెండు నెలల పింఛను పొందవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వరసగా పింఛను అందుకోని వారికి ఒకేసారి మూడు నెలలు పింఛను పొందే వీలును కూడా కల్పించింది.
Next Story