Sun Apr 13 2025 15:34:54 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పేదలూ గుడ్ న్యూస్.. రెడీ గా ఉండండి.. ఈ అర్హతలుంటే ఏపీలో ఇంటి స్థలం వచ్చినట్లే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనినిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనినిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అందరికీ ఇళ్లు పథకంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వనున్నారు. దీనిపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ మంత్రి చైర్మన్ గా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కమిటీలో సభ్యులుగా పురపాలక, గృహ నిర్మాణ శాఖ మంత్రులు, అధికారులు ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామాల్లోని పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వనున్నారు. ఇందులో పక్కా ఇళ్లను నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
షరతులు ఇవే...
పక్కా ఇళ్లను పొందాంలంటే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఉచిత నివాస స్థలాలను మహిళల పేరిట మాత్రమేఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని కూడా నిర్ణయించారు. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్న ప్రభుత్వం ఆలోచన అర్హులకు మాత్రమే ఇస్తామని, అయితే ఇందుకు షరతు కూడా విధించింది. ఇంటిస్థలం కేటాయించిన తర్వాత రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఇల్లు పొందిన వారు ఈ పథకానికి అనర్హులని కూడా చెప్పింది. జీవితంలో ఒకేసారి ఇల్లు ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
నిబంధనలు ఇవే...
ఇంటి స్థలం పొందే వారు గతంలో ఎలాంటి గృహాన్ని పొంది ఉండకూడదన్న నిబంధనను కూడా విధించింది. లబ్దిదారుడికి రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం ఉండకూడదని కూడా తెలిపింది. గతంలో కేంద్ర, రాష్ట్ర గృహపథకాల్లో లబ్ది పొందిన వారు కూడా ఇంటి స్థలానికి అర్హులు కారని కూడా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. లబ్దిదారులకు ఐదు ఎకరాల మెట్ట భూమి, 2.5 ఎకరాల మాగాణి భూమి ఉండకూదని కూడా నిబంధనలు విధించింది. లబ్దిదారులకు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నఈ ఇంటి జాగాల కోసం లక్షలాది మందికి ప్రభుత్వం తీపికబురు ఇచ్చినట్లయింది.
Next Story