Mon Dec 23 2024 00:43:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పేస్ట్, బ్రష్, షాంపూ వంటి వాటిని ఉచితంగా అందచేయనుంది.
ఇకపై నేరుగా...
ఇకపై వాటిని నేరుగా విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమచేసే విధానం తెచ్చినా రెగ్యులర్ గా చేయలేదనన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం దాదాపు పది కోట్ల రూపాయల బకాయిలున్నట్లు తేల్చింది. దీంతో ఇకపై వస్తువుల్ని నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 548 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 1.25లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరనుంది.
Next Story