Thu Dec 26 2024 21:44:18 GMT+0000 (Coordinated Universal Time)
Appsc Group 1 Update: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ వన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ వన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల 21వ తేదీతో గ్రూపు వన్ పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి గడువుగా గతంలో ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
అభ్యర్థుల కోరిక మేరకు...
అయితే అభ్యర్థులు చాలా మంది గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో దరఖాస్తులకు గడువును ఈ నెల 28వ తేదీ వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి మార్చి 17వ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగాల్సి ఉంది.
Appsc group1 last date extended webnote
Next Story