Fri Dec 20 2024 12:27:45 GMT+0000 (Coordinated Universal Time)
లిక్కర్ షాపుల గడువు పెంపు
లిక్కర్ షాపులు గడువు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లిక్కర్ షాపులు గడువు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల గడువు ఆంధ్రప్రదేశ్లో గడువు త్వరలోనే ముగియనుంది. దీంతో గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల గడువును మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాది పాటు..
ఏడాది పాటు ఇదే రకంగా మద్యం షాపుల నిర్వహణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల వరకూ మద్యం దుకాణాలు ఇదే పద్ధతిలో కొనసాగనున్నాయి. ఈ మేరకు 466 నెంబరు జీవోను అబ్కారీ శాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 2,944 దుకాణాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
Next Story