Mon Dec 23 2024 16:48:41 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్ఆర్ఏ పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు
హెచ్ఓడీ కార్యాలయాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఓడీ కార్యాలయాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో హెచ్ఓడీ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ ను ఎనిమిది నుంచి పదహారు శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్ఓడీ ఉద్యోగులకు....
హెచ్ఆర్ఏను గతంలో తగ్గించిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. గతంలో వీరికి ముప్పయి శాతం హెచ్ఆర్ఏ వచ్చేది. అయితే దీనిని తగ్గించి 8 శాతానికి తగ్గించింది. కానీ దీనిపై పునరాలోచించిన ప్రభుత్వం ఎనిమిది నుంచి పదహారు శాతానికి జగన్ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story