Tue Dec 17 2024 02:25:51 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్
ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఏపీ ప్రభుత్వం ఎరువులను సిద్ధం చేసింది.
ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఏపీ ప్రభుత్వం ఎరువులను సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధత మీద అధికారులతో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించారు.
కల్తీ ఎరువులకు...
అలాగే కల్తీ ఎరువుల కట్టడి పై కూడా అచ్చెన్నాయుడు చర్యలు ప్రారంభించారు. వీటితో పాటు లైసెన్స్ లేని సహకార సంఘాలకు కూడా పర్మిషన్లు ఇచ్చి ఎరువుల విక్రయాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సాగుపై అల్పపీడన ప్రభావం, పంట నష్టం గురించి కూడా అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి చర్చించారు. పంట పొలాల్లో నిలిచిన నీటి తొలగింపుతో పాటుగా, తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణపైనా రైతులకు సూచనలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పంట కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత చేపట్టి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.
Next Story