Sat Nov 23 2024 00:39:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. సినిమా థియేటర్లలో?
ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీఎఫ్డీసీ కి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఏపీలో ఉన్న ప్రతి థియేటర్ ఏపీఎఫ్డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని థియేటర్లు ప్రొవైడర్ గేట్ వే ద్వారానే టిక్కెట్ల అమ్మకాలను చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సర్వీస్ ఛార్జి....
ప్రతి టిక్కెట్ పై 2 శాతం సర్వీస్ ఛార్జిని వసూలు చేస్తారు. ఆల్ లైన్ టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను థియేటర్ల యాజమాన్యమే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. థియేటర్లలో పక్కాగా ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు చేయాలని, కొత్త సినిమాకు వారం ముందు నుంచే టిక్కెట్లు విక్రయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story