Sun Jan 12 2025 02:07:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది. ఆయనను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో సంజయ్ ను సీఐడీ చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ కుమార్ ఉన్నారు. 1996 బ్యాచ్ కు చెందిన సంజయ్ ను ఏపీ సీఐడీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.
సునీల్ స్థానంలో సంజయ్...
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఐడీ అనేక కేసులు నమోదు చేసింది. ప్రతిపక్షాలు కూడా సునీల్ కుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పలు కేసుల్లో సీఐడీ విభాగం ఏకపక్షంగా వ్యవహరించిందన్న ఆరోపణలను విపక్షాలు తరచూ చేస్తున్నాయి. అయితే సునీల్ కుమార్ ను ముఖ్యమైన విభాగం నుంచి తప్పించడం వెనక కారణాలేమై ఉంటాయా? అన్న చర్చ ఇటు ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. అకస్మాత్తుగా బదిలీ చేయడంపై పార్టీలోనూ చర్చ జరుగుతుంది.
Next Story