Mon Dec 23 2024 23:49:45 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మద్యం కొనాలంటే ఇక?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్లకు అనుమతి ఇచ్చింది
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్లకు అనుమతి ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏపీలోని మద్యం దుకాణాల్లో కేవలం నగదును మాత్రమే తీసుకుంటారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది.
డిజిటల్ చెల్లింపులు...
అయితే నగదు మాత్రమే తీసుకోవడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కాలంలోనూ నగదు చెల్లింపులపైనే విక్రయాలు జరపడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులకు అనుమతిచ్చింది. ఈరోజు నుంచే ఏపీలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి.
Next Story