Thu Dec 19 2024 10:24:19 GMT+0000 (Coordinated Universal Time)
ముంబయి నటి కేసు సీఐడీకి
ముంబయి సినీ నటి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముంబయి సినీ నటి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబయి నటిని వేదించిన కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు ఐపీఎస్ అధికారులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే న్యాయస్థానం వీరిపై చర్యలకు దిగవద్దని సూచించడంతో ఆగింది. అయితే దీనిని ఇప్పుడు సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరికొన్ని కేసుల ఫైల్స్‌ను...
దీంతో పాటు ఏపీలో పలు కీలక కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే 110 మందికి పైగా కేసులు, 30 మందికి పైగా అరెస్టు చేశారు. నేడు కేసుకు సంబంధించిన ఫైళ్లు సీఐడీకి మంగళగిరి డీఎస్పీ అప్పగించనున్నారు.
Next Story