Sun Dec 01 2024 10:49:09 GMT+0000 (Coordinated Universal Time)
సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.నేటి నుంచి వారి అటెండెన్స్ మొబైల్ యాప్ లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉన్నతాధికారులు ఉత్తర్వులను విడుదల చేశారు.
మొబైల్ ద్వారా అలెర్ట్...
ఒకసారే ఎంటర్ చేస్తే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామంటూ అందరికీ మొబైల్ ద్వారా మెసేజ్ లు పంపారు.గతంలో ఉద్యోగులు సచివాలయానికి వచ్చినప్పుడు లేదా వెళ్లే సమయంలో ఒకసారి హాజరువేసుకున్నా సరిపోయేలా ఉత్తర్వులుండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆఫీస్ కు వచ్చినా, వెళ్లినా ఖచ్చితంగా హాజరు ఉండాల్సిందేనని తెలిపింది.
Next Story