Sat Dec 28 2024 11:22:44 GMT+0000 (Coordinated Universal Time)
రేషన్ షాపుల ద్వారా జొన్నలు, రాగులు
రేషన్ దుకాణాల ద్వారా రాగులు, జొన్నలు కార్డు దారులకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.
రేషన్ దుకాణాల ద్వారా రాగులు, జొన్నలు కార్డు దారులకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఉచిత బియ్యం స్థానంలో జొన్నలు, రాగులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ప్రజలు వీటిని తీసుకుంటారా? లేదా? అన్న దానిపై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. జొన్నలు, రాగుల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతుంది. దీంతో బియ్యం స్థానంలో వాటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.
అభిప్రాయ సేకరణ...
అయితే వీటిని వాలంటీర్ల నుంచి డీలర్లు సేకరించి వారి పరిధిలో జొన్నలు, రాగులు అవసరం ఉందా? లేదా? అన్న దానిపై పౌరసరఫరాల శాఖ అభిప్రాయాలను సేకరిస్తుంది. లబ్దిదారుల నుంచి అనుమతి లేఖలను తీసుకుంటోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత చౌక ధరల దుకాణాల ద్వారా రాగులు, జొన్నలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాగులు, జొన్నలు కిలో వంతున తీసుకుంటే బియ్యం రెండు కిలోలను తగ్గించాలని నిర్ణయించారు.
Next Story