Fri Dec 27 2024 12:18:00 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు నిరుద్యోగులకు బిగ్ న్యూస్...గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు బిగ్ న్యూస్ చెప్పబోతుంది. ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ను ప్రభుత్వం చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు బిగ్ న్యూస్ చెప్పబోతుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకుకు సంబంధించిన గుడ్ న్యూస్ అయి ఉంటుందన్న అంచనాలున్నాయి. అయితే దేనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ నిన్ననే ఈ ప్రకటన చేశారు. రేపు అతి పెద్ద వార్త వినబోతున్నారంటూ లోకేష్ ట్వీట్ చేయడంతో యువకులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. అంచనాల ప్రకారం టీసీఎస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాబోతుందన్న వార్తను ఈరోజు లోకేష్ ప్రకటించే అవకాశముంది.
పెట్టుబడుల సంస్థకు...
లోకేష్ గాని, చంద్రబాబు గానీ ఈ ప్రకటన చేసే అవకాశముంది. నిన్న టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. దీంతో టాటా గ్రూపు నుంచి ఈ బిగ్ న్యూస్ వచ్చే అవకాశముందని తెలిసింది. రాష్ట్రంలో టాటా గ్రూపు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్న ప్రకటన రావచ్చు. టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందని తెలియడంతో లోకేష్ ఇలా ట్వీట్ చేశారంటారు.
విశాఖలో టీసీఎస్...
ఇక దీనికి తోడు ఏపీలో పెట్టుబడుల అన్వేషణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కు కో - కన్వీనర్ గా టాటా గ్రూపుల ఛైర్మన్ వ్యవహరించాలని గతంలోనే ప్రభుత్వం కోరింది. దీనికి ఆయన అంగీకారం తెలపడం కూడా బిగ్ న్యూసే అవుతుంది. రాజధాని అమరావతిలో సెంటర్ ఫర్ గోబర్నెస్ ను ఏర్పాటుకు టాటా సంస్థ అంగీకరించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. దీంతో పాటు విశాఖపట్నంలో టీసీఎస్ డెస్టినేషన్ సెంటర్ ఏర్పాటు ప్రకటన కూడా వచ్చే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ భారీ ప్రకటన ఉండే అవకాశం ఉండవచ్చు.
Next Story