Fri Apr 04 2025 21:31:38 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమయింది.

ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమయింది. ఈ ఏడాది అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ముందుగానే పరీక్షల నిర్వహణకు అధికారులు సమాయత్తమయ్యారు. అందిన సమాచారం మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
మార్చి 1వ తేదీ నుంచి...
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే.. మార్చి 1 నుంచి 20 వరకూ నిర్వహించనున్నారు. పర్యావరణం, మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Next Story