Mon Dec 23 2024 17:42:46 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కీలక నిర్ణయం.. ఆ కేసులన్నీ మాఫీ
కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో నమోదయిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో నమోదయిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. 2016 19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది.
ఉద్యమ సమయంలో.....
ఈ సమయలో ఉద్యమకారులపై 176 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటికే 153 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మిగిలిన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాపు రిజ్వేషన్ ఉద్యమంలో నమోదయిన అన్ని కేసులను ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా ఉపసంహరించుకున్నట్లయింది.
Next Story