Thu Nov 07 2024 13:07:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ కు షాక్.. బకాయీలు చెల్లించలేదని?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగిలింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏపీకి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగిలింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏపీకి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఏపీకి సరఫరా చేస్తున్న రెండు వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్టీపీసీకి చెల్లించాల్సిన బకాయీలు చెల్లించకపోవడంతోనే విద్యుత్తు సరఫరాను నిలపివేస్తున్నట్లు కార్పొరేషన్ యాజమాన్యం ప్రకటించింది.
రెండు వేల మెగావాట్లు.....
ఎన్టీపీసీ రెండు వేల మెగావాట్ల విద్యుత్తును నిలిపి వేయడంతో ఏపీ అధికారులు ఆర్టీపీసీ ద్వారా దానిని భర్తీ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఆర్టీపీసీలో మరో యూనిట్ ను ప్రారంభించాలని ఆదేశించారు. అదనపు విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును నిల్వలు లేకపోవడంతో ఆర్టీపీసీ దీనికి అంగీకరించలేదు. ఆర్టీపీసీ వద్ద ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. ఎన్టీపీసీకి చెల్లించాల్సిన బకాయీలు చెల్లించడమే ఉత్తమమని విద్యుత్తు శాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేది ఎండాకాలం కావడంతో విద్యుత్తు వాడకం పెరుగుతందని చెబుతున్నారు.
Next Story