Mon Dec 23 2024 14:35:05 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంలో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా నిధులను దారి మళ్లించారన్న దానిపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు పీడీ ఖాతాలకు మళ్లించిన 1,100 కోట్ల రూపాయల నిధులను ఎస్డీఆర్ఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ కేసును విచారించింది.
మళ్లించిన నిధులను....
రెండు వారాల్లోగా ఈ నిధులను ఎస్డీఆర్ఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లోగా ఫిర్యాదును పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Next Story