Fri Nov 22 2024 20:38:50 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నవంబర్ 1వ తేదీ కావడంతో ఉదయం నుంచే పింఛన్లను పంపిణీ చేస్తుంది
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నవంబర్ 1వ తేదీ కావడంతో ఉదయం నుంచే పింఛన్లను పంపిణీ చేస్తుంది. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు అందచేస్తున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం 1806 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65.54 లక్షల మంది పింఛన్ దారులు పింఛన్ ను అందుకోనున్నారు. ఈరోజు తెల్లవారు జామునుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందచేస్తున్నారు.
ఐదు రోజుల్లో...
లబ్దిదారులకు ఐదు రోజుల్లో నూరు శాతం పింఛనును పంపిణీ చేయాలని ప్రభుత్వం వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది. లబ్దిదారులకు బయో మెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈరోజు పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది. ఆర్బీఎస్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏ ఒక్కరికీ పింఛను అందలేదన్న ఫిర్యాదు రాకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story