Mon Dec 23 2024 12:31:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్.. చంద్రబాబు పెన్ను పెట్టేది దానిపైనేనట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. చంద్రబాబు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. చంద్రబాబు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఫైలుపై సంతకం చేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఫైలును కూడా విద్యాశాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పై చేయడం ద్వారా నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంకేతాలను పంపించినట్లవుతుందని భావిస్తున్నారు.
మెగా డీఎస్సీ...
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని. ప్రాధమిక విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నికల ప్రచారం సమయంలోనూ చంద్రబాబు యువతకు హామీ ఇచ్చారు. తన తొలి సంతకం కూడా దానిపైనే ఉంటుందని పదే పదే ప్రచార సభల్లో తెలిపారు. విద్యాశాఖ నుంచి ఖాళీగా ఉన్న పోస్టులను పంపాలంటూ ఆ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో 6,100 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో వీటిని పెంచి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది.
Next Story