Tue Mar 11 2025 06:19:28 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎంతటి శుభవార్త... అందరికీ ఉచితంగా వాహనాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్స్ ను పంపిణీ చేయాలని నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనుంది. దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్స్ ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్రవాహనాలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే దివ్యాంగులకు నెలకు ఆరువేల రూపాయల పింఛనును అందచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి దివ్యాంగులకు వంద శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలను అందించాలని నిర్ణయించడంతో హ్యాపీ ఫీలవుతున్నారు.
త్వరలోనే ఉత్తర్వులు...
త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఈ ఏడాది నియోజకవర్గానికి పది మంది దివ్యాంగులకు తిచక్ర వాహనాలను అందించాలని నిర్ణయించారు. వారు రాకపోకలను సులువుగా సాగించేందుకు, తమ పనులను సులభంగా చేసుకునేందుకు వీలవుతుందని భావించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 1,750 మంది దివ్యాంగులకు ఈ ఏడాది త్రిచక్ర వాహనాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. అనంతరం నాలుగు నెలల్లో లబ్దిదారుల ఎంపిక పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందడంతో ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు.
వీరికి మాత్రమే...
ప్రతి ఏటా 1,750 మంది దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలను అందించనున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రాధమికంగా అర్హతలను కూడా నిర్ణయించారు. అంగవైకల్యం 70 శాతం కంటే ఎక్కువ ఉండాలి. దీంతో పాటు 18 నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. అలాగే మూడు లక్షల రూపాయల ఆదాయ పరిమితిని కూడా అధికారులు విధించారు. మొత్తం మీద ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగులకు చాలా వరకూ ఊరట లభించినట్లే. దివ్యాంగులకు అండగా నిలబడాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇందుకోసం నిధులను కూడా బడ్జెట్ లో కేటాయించనున్నారు.
Next Story