Sun Dec 22 2024 22:47:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆపరేషన్ బుడమేరు త్వరలోనే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనుంది. త్వరలో ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనుంది. త్వరలోనే ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇటీవల వరదల కారణంగా బుడమేరు పొంగి అనేక మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు మునిగిపోయాయి. లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఈ వరద ఉధృతికి బుడమేరు ఆక్రమణలే కారణమని భావించి ప్రభుత్వం బుడమేరులో ఉన్న ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం 270 ఎకరాల్లో...
బుడమేరు ప్రాంతంలో మొత్తం 270 ఎకరాల్లో ఆక్రమణలను అధికారులు గుర్తించారు. విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిసకతై ఆక్రమణల వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు మొత్తం నలభై గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. ఇందులో మూడు వేల పక్కా ఇళ్లు, 80 నిర్మాణాలను గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామని కలెక్టర్ మీడియాకు తెలిపారు.
Next Story