Thu Jan 16 2025 18:50:28 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ రైతులకు గుడ్ న్యూస్... బకాయిలన్నీ నేడు విడుదల
నేడు ఆంధ్రప్రదేశ్ రైతులకు ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
నేడు ఆంధ్రప్రదేశ్ రైతులకు ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంది. గత రబీలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బిల్లులను క్లియర్ చేయనున్నారు. దీంతో దాదాపు 35,374 మంది రైతులు లబ్డి పొందనున్నారు. వీరికి 674.47 కోట్ల రూపాయల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు.
ఏలూరులో జరిగే కార్యక్రమంలో...
మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఇందుకు సబంధించిన చెక్కులను రైతులకు అందజేయనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో 82,825 మందికి రూ.1657.44 కోట్ల బకాయిలు పెట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఎన్డీఏ సర్కార్ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసిందని తెలిపింది.
Next Story