Mon Dec 23 2024 09:25:53 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.
త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించే అవకాశాలున్నాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈ పరీక్ష జనవరి 5న జరగాల్సి ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది.
గ్రూప్ 2 పరీక్షలను....
అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదాపడడంతో పాటు అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారిక ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి కోసం ఎదురు చూస్తుంది.
Next Story