Fri Dec 27 2024 18:49:35 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ నిర్ణయం.. పెంపుదల ఇప్పుడు కాదట
ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదలపై ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకుంది
ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదలపై ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకుంది. ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తొలుత జనవరి 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చోట్ల విలువల పెంపుపై కసరత్తు ప్రారంభించింది.
కొంత సమయం పడుతుండటంతో...
అయితే ఇందుకోసం మరింత సమయం పడుతుండటం, కొత్త సంవత్సరం ప్రారంభం, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు విలువల పెంపు ప్రకటిత తేదీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తిరిగి ఎప్పటి నుంచి ఛార్జీలను పెంచే విషయమూ తెలియచెప్పలేదు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. ఛార్జీలు పెరుగుతాయని రెండు రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు విపరీతంగా పెరిగాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story