Tue Dec 24 2024 19:35:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోగ్యం నిలకడగానే ఉంది
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనకు ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని వైద్యులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ అస్వస్థతకు గురయిన వెంటనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
కాసేపట్లో హెల్త్ బులిటెన్...
అయితే ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏఐజీ వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తామని చెప్పారు.
Next Story