Mon Dec 23 2024 05:27:52 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ట్వీట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో 80.66 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు.
మీనా ట్వీట్ చేయడంతో...
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలట్ ద్వారా 1.07 శాతం పోలింగ్ నమోదయింది. ఇది కలుపుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం 81.73 శాతం ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో 78.90 శాతం, 2019 ఎన్నికల్లో 79.80 శాతం ఓట్లు నమోదయ్యాయి.
Next Story