Sat Dec 28 2024 18:30:49 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ తవ్వకాలపై కీలక నిర్ణయం
రుషికొండ వివాదంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ విభాగం బృందాలతో సర్వే కు ఆదేశించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 1న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 5వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
182 అసెంబ్లీ స్థానాలకు...
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందుకోసం 51,782 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కమార్ చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 23తో గుజరాత్ అసెంబ్లీ గడువు పూర్తవుతుంది.
Next Story