Mon Dec 23 2024 01:29:49 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
వాలంటీర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలి వ్వాలని కోరింది.
వాలంటీర్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలు ఇవ్వాలని కోరింది. రాజీనామాలు ఎంత మంది చేశారు? ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నారో తెలపాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఆమోదించవద్దంటూ...
వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని, ఎన్నికల కమిషన్ వారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశించడంతోనే వాలంటీర్లు కావాలని రాజీనామాలు చేస్తున్నారన్న పిటీషన్ పై విచారణ జరిగింది. అధికార పార్టీకి మేలు చేకూర్చడానికే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని కూడా పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు. వారు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని, యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ కాబట్టి వారి ప్రభావం ఉండనుందని, వారి రాజీనామాలను ఆమోదించవద్దంటూ ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ కోరారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Next Story