Mon Dec 23 2024 06:46:48 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్నకు హైకోర్టు నోటీసులు
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయ్యన్న ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు పిటీషన్ ను స్వీకరించి అయ్యన్నపాత్రుడికి నోటీసులు జారీ చేసింది.
సెక్షన్ ఎలా వర్తించదు?
తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అయ్యన్న పాత్రుడు కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. రెండు పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 467 సెక్షన్ వర్తించదని ఎలా చెబుతారని విశాఖ మెట్రోపాలిటన్ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది.
Next Story