Mon Dec 15 2025 08:03:06 GMT+0000 (Coordinated Universal Time)
సడన్ బ్రేక్ వేయడంతో హోంమంత్రి అనిత వాహనానికి?
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది వంగలపూడి అనిత కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశారు. దీంతో వంగలపూడి అనిత ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది.
తప్పిన ప్రమాదం...
వెంటనే హోం మంత్రి వంగలపూడి అనిత మరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఎస్కార్ట్ సిబ్బంది హోంమంత్రి వంగలపూడి అనితను వేరే వాహనంలో పంపించారు.
Next Story

