Mon Jan 06 2025 05:44:11 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : హోంమంత్రి పీఏపై వేటు.. అవినీతి ఆరోపణలపై
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తొలగించింది
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తొలగించింది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బదిలీలు, పోస్టింగ్ లతో పాటు పేకాట శిబిరాల నిర్వహణతో పాటు అనేక విషయాల్లో జగదీష్ పాత్ర ఉందని భావించిన ప్రభుత్వం ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించింది.
పదేళ్లుగా పనిచేస్తున్న...
హోం మంత్రి అనిత వద్ద జగదీష్ పదేళ్లుగా పనిచేస్తున్నాడు. హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఎవరినీ లెక్క చేయకపోవడంతో పాటు అనేక అవకతవకలకు పాల్పడటం, అవినీతి పనులకు తెరలేపడం వంటి పనులు చేయడంతో ఆయనకు పెద్దయెత్తున టీడీపీ శ్రేణుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఆయనపై వేటు వేసినట్లు తెలిసింది.
Next Story