Wed Apr 23 2025 22:00:20 GMT+0000 (Coordinated Universal Time)
మాకు ఏ నానీ తెలియదు.. కొడాలి నాని తప్ప
హీరో నాని వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు

హీరో నాని వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తమకు ఏ నానీలు తెలియదని, ఒక్క కొడాలి నాని తప్ప అని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాల్లో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇందుకు నానా అర్థాలు తీస్తే ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చుగా?
సినిమా ప్రొడక్షన్ ఖర్చు ముప్ఫయి శాతం అయితే, సినీ హీరోల రెమ్యునరేషన్ 70 శాతం ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. హీరోలు వాళ్ల రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. హీరోలకు మాత్రం కడుపు మంటా ఉందని హీరో నాని వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ పరోక్షంగా సెటైర్ వేశారు.
Next Story