Fri Nov 08 2024 03:51:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో ఎన్నికలకు రెడీ
ఆంధ్రప్రదేశ్ మరో ఎన్నికలకు సిద్ధమయింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది
ఆంధ్రప్రదేశ్ మరో ఎన్నికలకు సిద్ధమయింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 16వ తేదీ నుంచి సాగు నీటి సంఘాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, నలభై రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అమరావతి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ సిఈలు,ఎస్ఈ ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోఈ విషయం తెలిపారు.
సిద్ధం కండి...
రాష్ట్రంలోని 6219 సాగు నీటి సంఘాలకు,252 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు,56 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.లోకలైజేషన్ పూర్తయిన కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వెంటనే కాడా కమిషనర్ కు ప్రతిపాదనలు పంపాలని,కొత్త జిల్లాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.నీటి పారుదల శాఖ ద్వారా విస్తీర్ణాన్ని నిర్ణయించాల్సి ఉందని, పునర్విభజన పూర్తయిన తరువాత రెవిన్యూ శాఖ ఓటర్ల జాబితాను సిద్దం చేస్తుందని, సిసిఆర్సీ కార్డులు ఉన్న కౌలుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని లేని పక్షంలో ఒరిజినల్ పట్టాదారు ఓటరుగా నమోదు అవుతారని అన్నారు. ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని,ఇలా అన్ని జిల్లాల్లో ఎటువంటి గొడవలూ లేకుండా సాగు నీటి సంఘాల ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ఇప్పటి నుండే కలెక్టర్లు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
Next Story