Thu Apr 24 2025 01:22:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైఎస్ జగన్ కు షాకిచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చారు. ఈ నెల 24వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ అయ్యాయి.
భద్రతా కారణాల దృష్ట్యా...
భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లు జారీ చేశారు. అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కు అనుమతి ఉంటుంది. అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఇస్తారు. అసెంబ్లీ గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అసెంబ్లీ గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఇస్తారు. మండలి ఛైర్మన్, స్పీకర్, సీఎం వచ్చి వెళ్లే కారిడార్ లో ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంటే జగన్ ఎమ్మెల్యేలు వచ్చే గేట్ 4 నుంచి మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు రావాల్సి ఉంటుంది. జగన్ గేట్ నెంబరు వన్ నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వచ్చేందుకు ప్రయత్నించడంతో వివాదంగా మారింది. దీంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు.
Next Story