Tue Dec 24 2024 20:26:51 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఉత్తీర్ణులయిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు లోకేష్.
ట్వీట్ లో ఏమన్నారంటే?
ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేశామని తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారన్నారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న లోకేష్ టెట్ లో అర్హత సాధించిన వారందరికీ తన శుభాకాంక్షలు. తెలిపారు.
Next Story